Aug 09,2023 20:37

గిరిజన విద్యార్థికి మెమోంటో అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : గిరిజనుల అభివద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కషి చేస్తోందని కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌ తెలిపారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌, జెసి ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొని గిరిజన నాయకులతో కలిసి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆదివాసీలందరూ చైతన్యవంతులు కావలాని పిలుపునిచ్చారు. చదువుతోనే తలరాత మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది అన్నారు. గిరిజనులు ఎంత బాగా చదివితే భవిష్యత్తు అంత బాగా మారుతుందని పేర్కొన్నారు. చదువుకున్న వారు ఉన్నత స్థాయిలో స్థిరపడినప్పుడు వారు మరో 10 మందికి సాయం చేయగలిగే అవకాశం ఏర్పడుతుంది అన్నారు. చదువు కేవలం సంపాదన కొరకే కాదని, భవిష్యత్‌ తరాలను ముందుకు నడిపిస్తుంది, చెప్పారు. గిరిజనులు వారి హక్కుల సాధనకు కషి చేయాలన్నారు. ఇంకా చాలా చోట్ల విద్యా, వైద్యానికి గిరిజనులు చాలా దూరం ఉన్నారని,. అవన్నీ వారికి అందించాలనే ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో భాగంగా అంగన్వాడి కేంద్రాలు, సచివాలయాలతో పాటు అనేక పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని చెప్పారు. వీటన్నింటినీ మీరు సద్వినియోగం చేసుకొని అభివద్ధి చెందాలని, తమ దృష్టికి వచ్చిన గిరుజనుల సమస్యలన్నీ వందశాతం పరిష్కరించేందుకు కషి చేస్తున్నామని తెలిపారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే స్పందనలో కానీ, నేరుగా కానీ తనని కలవవచ్చునని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కూడా గిరిజనులకు సంక్షేమం అని కాకుండా తండాలలో నెలకొంటున్న సమస్యలు వాటి పరిష్కారం పై దష్టి పెట్టాలని సూచించారు. అటవీ పరిధిలో భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు గ్రామసభల ద్వారా తీర్మానం చేసుకొని పంపితే చట్టం పరిధిలో మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. దాదాపు పదేళ్ల తరువాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో దాదాపు 4వేల మందికి భూ పంపిణీ చేశామని, ఇందులో 450 దాకా ఎస్టీ కుటుంబాలు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అందరూ బాగా చదువుకొని అభివద్ధిలోకి రావాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధ గిరిజన నాయకులు వివిధ అంశాలపై సమావేశంలో వివరించారు. అనంతరం పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన గిరిజన విద్యార్థులకు కలెక్టర్‌ చేతుల మీదుగా మెమోంటో బహుకరించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు జిల్లా కలెక్ట రును శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అబ్స్‌ లొమ్‌, గిరిజన నాయకులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.