ప్రజాశక్తి - టి.నరసాపురం
మండలంలో గిరిజనులు, పేదలు సాగుచేస్తున్న భూములకు పట్టాలివ్వాలని ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు తుమ్మల సత్యనారాయణ డిమాండ్ చేశారు. పట్టాలు పంపిణీ చేయాలని కోరుతూ గురువారం ప్రజాసంఘాల కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ పోరాటాలలో ఆదివాసీలు, పేదలు, దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా శిక్షణ తరగతులు ఈనెల 27, 28 తేదీల్లో టి.నరసాపురంలో జరుగుతాయన్నారు. ఈ తరగతులకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వంద మంది ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. ఈ తరగతులను జయప్రదం చేయాలని కోరారు.










