Nov 21,2022 23:37

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న కిల్లో సురేంద్ర

గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర.
ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌
: గిరిజనుడు నిర్మించిన విజరు విలాస్‌ లాడ్జి కూల్చితే పోరాటం తప్పదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర హెచ్చరించారు. .అరకువేలి మండలం పెదలబుడు పంచాయితీ కంఠబౌన్సుగుడ గ్రామానికి చెందిన జంపరంగి అశ్వద్ధామ అనే గిరిజనుడు నిర్మించిన విజరు విలాస్‌ లాడ్జీను కూల్చివేతకు అధికారులు నోటీసు జారీ చేయడాన్ని అఖిలపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. సోమవారం అరకువేలి గిరిజన భవనంలో గిరిజన సంఘం ఆధ్వర్యాన, వివిధ గిరిజన ప్రజా సంఘాలు, ఉద్యోగుల సంఘం నాయకులు అఖిల పక్షం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మట్లాడుతూ ఒక్క గిరిజనుడు నిర్మించిన లాడ్జి కూల్చివేత నోటీసులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.అరకువేలి మండలంలోని 1/70 చట్టం విరుద్ధంగా గిరిజనేతరుల బహుళ అంతస్తులు భవనాలు, లాడ్జీలు, రిసార్ట్స్‌ నిర్మించి అడ్డగోలుగా వ్యాపారం సాగిస్తున్నా పట్టించుకోని పంచాయితీ అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, ఇపుడు గిరిజనుడు నిర్మించిన లాడ్డిను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు పాంగి నందో, డిటియఫ్‌ జిల్లా అధ్యక్షుడు వికాస్‌, గ్రీన్‌ అండ్‌ హెల్త్‌ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు, నర్సింగరావు ఆదివాసి సేన సంఘం నాయకులు, దురియ సాయిబాబా, యూటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి, వి మహేష్‌, ఆదివాసి సంక్షేమ సంఘం నాయకులు షర్టు మోహన్‌, మండి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షడు పి బాలదేవ్‌, గిరిజన సంఘం మండల కార్యదర్శి పి రామన్న, ఇతర ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.