Aug 10,2023 00:29

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు:జిల్లాలో గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సూచించారు. స్థానిక ప్రైవేటు కళ్యాణ మండపంలో పాడేరు శాసన సభ్యురాలు భాగ్యలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో కలెక్టర్‌ మాట్లాడుతూ, 50 రోజుల్లో సమగ్ర గిరిజనాభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. పివిటిజిల అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంఎల్‌ఎ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు కనుమరుగుకాకుంగా కాపా డాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సుభద్ర మాట్లాడుతూ, ఆదివాసీల అభివృద్దికి ముఖ్యమంత్రి పెద్దపీట వేసారని చెప్పారు. పిఓ అభిషేక్‌ మాట్లాడుతూ,టిడిఏ పరిధిలో. పాడేరు నియోజక వర్గంలో రూ.100 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబు, ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వి.ఎస్‌. ప్రభాకరరావు, ఎం.వేంకటేశ్వరరావు ఎ.పి.మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు తమర్భ నరసింగరావు, పాడేరు ఎంపిపి ఎస్‌.రత్నకుమారి, పాడేరు సర్పంచ్‌ కె.ఉషారాణి, ఎస్టీ, కమీషన్‌ సభ్యులు టి.లిల్లీ, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ డి.వి.ఆర్‌.ఎం. రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్‌ బాషా, డిఎల్‌పిఓ పి.ఎస్‌ కుమార్‌ పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌ :భారత రాజ్యాంగంలో కల్పించిన గిరిజన హక్కులు, చట్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. అరకులోయ అంజాలి రిసార్ట్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఏపీ రాష్ట్ర ఎస్టీ ఆదివాసీ ఛైర్పర్సన్‌ పాచిపెంట కుమారి ఆధ్వర్యాన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి నాయకులు పాల్గొన్నారు.
రంపచోడవరం:ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రంపచోడవరం ఐటిడిఎ ఆధ్వర్యంలో స్థానిక యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఏడు ఆదివాసీ తెగలకు చెందిన పెద్దలతో కలిసి ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. వైటిసి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ఆదివాసీ సంస్కృతులకు సంబంధించిన స్టాల్స్‌ను ఆమె సందర్శించారు. ఐటీడీఏ ఏపీవో శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ డిడి, ఎడిఎంహెచ్‌ఓ భాస్కర్‌ పాల్గొన్నారు.
మారేడుమిల్లి : మండల కేంద్రంలోని ఎంపీపీ పాఠశాలలో మారేడుమిల్లి సర్పంచ్‌ కొండా జాకబ్‌ ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. వనవాసి సంస్థ డైరెక్టర్‌ గొర్లె అనుదీప్‌ కుమార్‌ మాట్లాడారు. ఎంపీపీ సార్ల లలిత కుమారి, వైస్‌ ఎంపీపీ లక్కొండ రవికుమార్‌, జడ్పిటిసి బాలాజీ బాబు, ఇన్‌ఛార్జి ఎంపీడీవో జయంతి, తహశీల్దారు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
రాజవొమ్మంగి : గిరిజన, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారీ ర్యాలీ చేసి, స్థానిక అల్లూరి జంక్షన్‌ వద్ద మానవహారం చేపట్టారు. ఎంపీపీ గొము వెంకటలక్ష్మి, జడ్పిటిసి ఒడుగుల జ్యోతి, సర్పంచుల సమైక్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ, ఎంపీడీవో లోకుల యాదగిరిశ్వరరావు, ఎంఈఓ కె తాతఅబ్బాయి దొర, తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యాఆచారి, స్థానిక ఎస్సై టీజీ నరేంద్ర ప్రసాద్‌, గిరిజన నాయకులు వంతు బాలకృష్ణ, అచ్చారావు, శ్రీను పాల్గొన్నారు.
సీలేరు : జీకే మండలం సీలేరులో గిరిజనులు పూర్వపు ఆచారాలకు ప్రకారంగా వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో, సిపిఐ నాయకులు సుంకర విష్ణుమూర్తి, మాజీ సర్పంచ్‌ ఏసు వరరాజు పాల్గొన్నారు.