Apr 30,2023 00:29

కార్యక్రమంలో పాల్గొన్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

- ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం

ఏజెన్సీలోని గిరిజనుల భూ సమస్యల పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. శనివారం స్థానిక తన ఛాంబర్‌లో గిరిజనులకు సంబంధించిన భూ సమస్యలపై న్యాయవాదులతో ప్రాజెక్ట్‌ అధికారి కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ భూ సమస్యలు ఆయా గ్రామాల్లో దర్యాప్తు చేసి వారి అర్హతను బట్టి గిరిజనులకు న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టాలు ఉండి వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు న్యాయం చేస్తామన్నారు.