Nov 14,2023 00:46

ఆందోళన చేపడుతున్న గిరిజనులు

ప్రజాశక్తి-జి.మాడుగుల:మండలంలోని ఉరుము గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో నల్ల రాయి క్వారీ తవ్వకాలను ఆపాలని ఆయా గ్రామస్తులు సోమవారం క్వారీ వద్ద ఆందోళన చేపట్టారు. క్వారీ ఏర్పాటుతో కాపీ తోటలు, మిరియాలు, వరి పంటలు దెబ్బతింటున్నాయన్నారు. దీంతో పంటలు కూడా సరిగా పండ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు పండక పోవడంతో ఆర్థికంగా నష్ట పోతున్నామని ఆయా గ్రామాల గిరిజనులు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే ఆ క్వారీని తవ్వకాలను ఆపాలని రైతులు, ఆంధ్ర ప్రదేశ్‌ గిరిజన సమాఖ్య జిల్లా సహా కార్యదర్శి సిగ్గే లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.