ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని కొర్ర పంచా యతీ పరిధిలోని కొర్రా, గొందివలస, భల్యవలస, గ్రామాల్లోని సోమవారం ఆ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ లకే అర్జున్, జి.విజయ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే చెట్టి చెట్టి ఫాల్గుణ హాజరై మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గిరిజనులకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గిరిజన అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు ప్రవేశ పెడుతుందని తెలిపారు. ఆయా పథకాలను అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులు అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పిటిసి సభ్యురాలు చటారి జానకమ్మ, మండల వైస్ ఎంపీపీ శెట్టి ఆనందరావు, మండల వైసీపీ అధ్యక్షులు శెట్టి గోపాల్, మాజీ జడ్పిటిసి సభ్యుడు శ్రీ రాములు, పోతాంగి గ్రామ పంచాయితీ సర్పంచ్ వెంకటరావు, వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.










