ప్రజాశక్తి- పెదబయలు : గిరిజన యువత చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని, తద్వారా మానసికోల్లాసం వస్తుందని సిఆర్‌పిఎఫ్ 198 బెటాలియన్ కమాండెంట్ రాజేష్ పాండే అన్నారు. 'సివిక్ యాక్షన్ ప్రోగ్రాం'లో భాగంగా పెదబయలు మండలం రూఢకోటలో గిరిజన యువతకు మంగళవారం సిఆర్‌పిఎఫ్ 198 బెటాలియన్ కమాండెంట్ రాజేష్ పాండే, ఇన్‌స్పెక్టర్ మంజిత్ సింగ్, ముంచంగిపుట్ ఎస్‌ఐ రవీంద్ర, స్థానిక సర్పంచ్ సురేష్‌కుమార్ ద్వారా క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమాండెంట్ రాజేష్‌పాండే మాట్లాడుతూ, ఏటా సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలోభాగంగా గిరిజనులకు గొడుగులు, రేడియోలు, దుప్పట్లు, క్రీడా సామగ్రి పంపిణీ చేస్తున్నామని, భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో బాబుసాల సర్పంచ్ మఠం బంగారమ్మ, ఎఎస్‌ఐ పోతురాజు, సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ సిబ్బంది, రూఢకోట, బాబుసాల, కుమడ, కోరవంగి పంచాయితీల క్రీడాకారులు పాల్గొన్నారు.










