Apr 04,2023 00:11

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న జెడ్‌పిటిసి మత్య్సలింగం

ప్రజాశక్తి -హుకుంపేట: గిరిజన యువత క్రీడల్లో రాణించాలని జెడ్‌పిటిసి రేగం మత్య్సలింగం అన్నారు. సోమవారం మోదకొందమ్మ పండుగ సందర్భంగా కమిటీ సభ్యులు నైని.సత్తిబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ప్రారంభ పోటీలోని ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జెడ్‌పిటిసి మత్య్సలింగం మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో యువత అన్నిరంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. క్రీడల్లో నైపుణ్యత సాధిస్తే ఉన్నతస్థాయికి చేరేందుకు అవకాశాలున్నాయన్నారు. క్రికెట్‌ టోర్నీలో విజేతలకు మొదటి బహుమతి కింద రూ.50వేలు ఆర్థికసాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాస్థాయి క్రికెట్‌ టోర్నీకి జెడ్‌పిటిసి రూ.50వేలు మొదటి బహుమతికి ఆర్థికసాయం ఇస్తే, రన్నరప్‌కు రూ.25వేలు నగదు బహుమతికి ఒంటుబు శామ్యూల్‌ ఆర్థికసాయాన్ని సమకూరుస్తారన్నారు. కార్యక్రమంలో కిలగాడ సింహాచలం, పాంగి సాంబ, రాపా ఎంపిటిసి నాగలక్ష్మి , సర్పంచ్‌లు బెటికేరి మత్స్యరాజు, ధనసాని సత్యవతి, సోమెల శాంతకుమారి, పాటి లక్ష్మి, మర్రి చినారావు, సర్పంచ్‌ ప్రతినిధులు దూసూరి.వెంకట్‌, పూజారి సుబ్బారావు, కోరబు వెంకట్‌, ధనుసాని మురళీమోహన్‌, గోమంగి. చిన్నశ్వరరావు, క్రికెట్‌ టోర్నీ నిర్వాహకులు కొర్ర నాగబాబు, శివాజీ, రాము, సాయి, సూర్య,శేఖర్‌, రామయ్య పాల్గొన్నారు