
సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ కల్పనకుమారి
ప్రజాశక్తి-సీతంపేట : సీతంపేట ఐటిడిఎ పరిధిలో విడివికెల్లోని గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. గురువారం వైకెపి, జిసిసి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విడివికెల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకొంటామన్నారు. ఆమోదం బ్రాండ్ పేరుతో పట్టణాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజన ఉత్పత్తుల ప్యాకింగ్ ఆకర్షించే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ రోసిరెడ్డి, జిసిసి డిఎం సంధ్యారాణి, ఎపిడి రమణ, ఎపిఎంలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.