Nov 15,2023 19:49

మాట్లాడుతున్న మంత్రి కాకాణి

మాట్లాడుతున్న మంత్రి కాకాణి
గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం కషి..
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:గిరిజనుల సంక్షేమం కోసం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా కషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న ఇళ్లు నిర్మించుకుంటున్న గిరిజన మహిళలకు మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మంత్రి ఆర్ధిక సాయం అందించారు. ఒకొక్క ఇంటికి రూ.15 వేలు వంతున చెక్కులను, మ హిళలకు వంట గ్యా స్‌ కనెక్ష న్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల సం క్షేమం కోసం, ముఖ్యంగా గిరిజన వర్గాల సం క్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ మేరకు ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాల ను అమలు చేస్తోందని చెప్పారు. గిరిజనుల సంస్కతిలోనే క్రమశిక్షణ, నిజాయతీ ఇమిడి ఉన్నాయని తెలిపారు.
అణగారిన గిరిజనుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ గి రిజన సంక్షేమ కమిటీ పనిచే స్తుందని మంత్రి తెలిపారు.కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సు ధీర్‌ రెడ్డి, కన్వీనర్‌ ఉప్పల శంక రయ్య గౌడ్‌, వైసీపీ జిల్లా అధి కార ప్రతినిధి తలమంచి సురేం ద్ర బాబు, ఎంపీపీ స్వర్ణలత, జెడ్పిటిసి శేషమ్మ, ఏఎంసి డైరెక్టర్‌ మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్‌, వివిధ శాఖల అధికారులు పా ల్గొన్నారు.