Nov 27,2022 00:13

మాట్లాడు తున్న గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామారావు

ప్రజాశక్తి - రంపచోడవరం
ఈ నెల 28న రంపచోడవరంలో జరుగుతున్న గిరిజన సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు పిలుపునిచ్చారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి తీగల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం రంపచోడవరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రంపచోడవరం కేంద్రంగా 11 మండలాల పరిధిలో గిరిజన సమస్యలపై జిల్లా మహాసభ నిర్వహిచడం జరుగుతుందని చెప్పారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం గిరిజన సంఘం పని చేస్తుందని తెలిపారు. గిరిజనుల హక్కులు కాపాడాలంటే ఉద్యమాలు చేయాలన్నారు.
మహాసభను జయప్రదం చేయండి
చింతూరు : గిరిజన సంఘం జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి కారం నాగేశ్వరావు కోరారు. శనివారం ఏర్పాటుచేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, గిరిజనుల మీద చిన్న చూపు చూస్తున్నాయని తెలిపారు. జిఓ నెంబర్‌ 3ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాండ్రు నాగార్జున్‌, కమిటీ సభ్యులు కుర్సం బ్రహ్మయ్య, శ్రీకాంత్‌ ప్రేమ్‌ తదితరులు పాల్గొన్నారు.