Aug 05,2023 00:10

ఎమ్మెల్యే ధనలక్ష్మిని ప్రశ్నిస్తున్న నెల్లిమెట్ల గ్రామస్తులు

ప్రజాశక్తి - రాజవొమ్మంగి
'గిరిజన సమస్యలు మీకు పట్టవా. గ్రామంలో ఏ సమస్యా పరిష్కారానికి నోచుకోవడం లేదు' అంటూ అధికార పార్టీకి చెందిన రంపచోడవరం నియోజకర్గ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిని మండలంలోని లబ్బర్తి పంచాయతీ నెల్లిమెట్ల గ్రామస్తులు నిలదీశారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి శుక్రవారం ఆ గ్రామానికి వెళ్లారు. వెంటనే గ్రామస్తులంతా గుమిగూడి తమ గ్రామంలో ప్రభుత్వ ఇళ్లు రాలేదని, రోడ్లు, డ్రెయిన్లు సక్రమంగా లేవని అన్నారు. తాగునీరూ, ఇతర సమస్యలూ నెలకొన్నాయని చెప్పారు. వాటిని పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని అన్నారు. ఏజెన్సీలో జిఒ నెంబర్‌ 3 అమలు కావడం లేదని, గిరిజనుల హక్కులు, చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించకుండా ఇటువంటి పర్యటనలతో ఉపయోగమేముందని మండిపడ్డారు.