Jul 22,2023 22:01

పాలకొండలో రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్‌

ప్రజాశక్తి- సీతంపేట : గిరిజన ప్రాంతం అభివృద్ధికి అన్ని గ్రామాల్లో రోడ్లు వేస్తున్నట్టు ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. మండలంలో దొనుబాయి ప్రధాన రహదారి నుంచి చిన్నరామ జంక్షన్‌ వరకు కొత్తగా ఏర్పాటు చేసిన బిటిరోడ్‌ ఉపాధి హామీ నిధులు ద్వారా రూ.50లక్షలు అంచనా వ్యయంతో గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నిర్మించిన బిటి రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ రహదారితో గ్రామస్తులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ, ఎఎంసి చైర్మన్‌ హిమరక మోహన్‌రావు, జడ్పిటిసి ప్రతినిధి సవర రాము, వైస్‌ ఎంపిపిలు, స్థానిక సర్పంచ్‌ సవర మౌనిక, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రహదారి ప్రారంభం
పాలకొండ రూరల్‌: మండలం డోలమడ జంక్షన్‌ నుంచి వంతవాడకు ఉపాధిహామీ నిధులు రూ.2.20కోట్లు అంచనా వ్యయంతో నిర్మించిన బిటి రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపిలు కణపాక సూర్య ప్రకాష్‌, వాకముడి అనిల్‌, రణస్థలం రాంబాబు, బిడ్డిక వెంకయ్య, పాండ్రంకి హైమావతి, ఉపేంద్ర, గొర్లి కష్ణ, రాజారావు, వాసు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.