ప్రజాశక్తి-హుకుంపేట:గిరిజన హుక్కులు పటిష్టంగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు, అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు డిమాండ్ చేశారు. తుంభవలస గ్రామానికి చెందిన 100మంది సీపీఎంలో చేరారు. జడ్పీటీసీ దీసారి గంగరాజు సమక్షంలో వీరంతా చేశారు. పార్టీలో చేరిన గిరిజనులు అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం భూర్జా పంచాయితీ, తుంభవలస గ్రామస్తులు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ, ఆటవీ సంపదను కాపాడుకునేందుకు గిరిజనులు ఐక్య కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అబివృద్ది కానరాలేదన్నారు. తుంభ వలస గ్రామ ప్రజలు సీపీఎం సిద్దాంతలను నచ్చి సమస్యలు సాధించేందుకు చేరడం జరిగిందని తెలిపారు. సిపిఎం చేపడుతున్న ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై గ్రామస్థులంతా కలిసికట్టుగా పార్టీలో చేరారని ఆయన తెలిపారు. పార్టీ సిద్ధాంతలు వివరించి కండువాలు వేసి, సాధరంగా ఆహ్వానించారు. తుంభ వలస గ్రామంలో ప్రధాన సమస్యలైన రోడ్డు, మినీ అంగన్ వాడీ కేంద్రం, ఇల్లు, తాగునీరు, పైప్ లైన్ కుళాయి గ్రాంట్‌కు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, సీపీఎం జిల్లా నాయకులు సొంటేన హైమావతి, మండల కార్యదర్శి వలసనైని లక్ష్మణ్‌రావు, నాయకులు తాపుల కృష్ణారావు, అప్పల కొండ పడాల్, పాంగి సోమన్న, కిల్లో రామారావు, మజ్జి బాలకృష్ణ, కొర్రా కృష్ణ, గ్రామస్తులు పృద్వి, కొర్ర చిట్టిబాబు, కామేష్, శ్రీను, చిన్నం నాయుడు, అప్పల నాయుడు, కొండబాబు, రాజు, అప్పలమ్మ పాల్గొన్నారు.










