సమావేశంలో మాట్లాడుతున్న గిరిజన సంఘం నాయకులు అప్పారావు
ప్రజాశక్తి - సీతంపేట : గిరిజన హక్కులు, రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర పాలకులు దాడి చేస్తున్నారని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బి.అప్పారావు విమర్శించారు. శనివారం ఎపి గిరిజన సంఘం ఏడో మండల మహాసభ నాయకులు ఎం.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాతూ గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. జీడీ పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి గిరిజనులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా జె.శ్రీరాములు, కార్యదర్శిగా బి.సాయి, ఉపాధ్యక్షులుగా బి. పరశురాం, పి సలీం, పి.వీరన్న, కార్యదర్శులుగా ఎస్.ఆనందరావు, ఎస్.బాలు, బి.సంతు, ఎస్.వెంకన్న, కోశాధికారిగా ఎస్.శ్రీను ఎన్నికయ్యారు.










