ప్రజాశక్తి- అనకాపల్లి : గిరిజనుల హక్కులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. గురువారం స్థానిక రింగ్ రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టిడిపి ఎస్‌టి సెల్ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో కలపాలని, అక్కడ శతశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గిరిజనులకే వర్తించేలా ఉన్న జిఒ 3ను పునరుద్ధరించాలని కోరారు. టిడిపి హయాంలో చంద్రబాబు ఈ జిఒను తీసుకొచ్చి గిరిజనాన్ని అదుకుంటే, సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసినా రివ్యూ పిటిషన్ వేయడానికి సిఎం జగన్ ప్రభుత్వం ముందుకు రాకపోవడం గిరిజనులకు అన్యాయం చేయడమేనన్నారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనకు ఇది నిదర్శనమన్నారు. ఉందన్నారు. జిల్లాలో నాన్ షెడ్యూల్ గిరిజన ప్రజలను షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించి వారికి అన్నిప్రభుత్వ రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. సమావేశంలో టిడిపి ఎస్‌టి సెల్ అధ్యక్షులు దున్ను దొర, పార్లమెంటు అధ్యక్షులు బద్రి చిన్నబ్బాయి దున్ను దొర పాల్గొన్నారు.










