ప్రజాశక్తి-పాడేరు: గిc కలిసి పాడేరులో పర్యటించారు. ముందుగా మోద కొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకృష్ణా పురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. కాఫీ, జిసిసి, వన్ ధన్ వికాస కేంద్రం స్టాల్స్ ను సందర్శించారు. జిల్లాలో కాఫీ సాగు, ఉత్పత్తి, గిరిజన రైతులు కాఫీ సాగులో పొందుతున్న ఆదాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాఫీ, సాగు, జిసిసి సేవలు ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మండలానికి చెందిన 113 వన్ వికాస కేంద్రాల వివరించారు. భూముల పట్టాలు పంపిణీ చేసారు. ముందుగా 30 మందికి అటవీ హక్కుపత్రాలు పంపిణీ చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు భరోసా వ్యవసాయ పెట్టుబడులు గురించి అధికారులు వివరించారు.అనంతరం 10 వతరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ఇంటి దగ్గర బాగుందా, పాఠశాలలో బాగుందా అంటూ విద్యార్థులతో ముచ్చటించారు. అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీని అధికారులు వివరించారు. భారత స్వాతంత్ర పోరాటంలో 1000 మంది గోండు గిరిజనులు ప్రాణాలను అర్పించారని చెప్పారు. అనంతరం విద్యార్థినులతో కలిసి దింసా నృత్యం చేశారు. అనంతరం స్థానిక గురుకుల కళాశాల ప్రాంగణంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్, గిరిజన సంక్షేమశాఖ డిడి ఐ. కొండలరావు, ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వి.ఎస్. ప్రభాకరరావు, ఎం. వేంకటేశ్వరరావు, టిసిఆర్‌టిఎం అధికారి జి. చినబాబు, ఎస్టీ కమిషన్ అధికారులు పి.కె. పరీడా, జయంత్ జె.సరోడే, రాధాకాంత త్రిపాఠి, ఆర్.ఎస్. మిశ్రా, కురసా ఉమా మహేశ్వరరావు, పాంగి రాజారావు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు లిల్లీ, తదితరులు పాల్గొన్నారు.
పాడేరు : రాజ్యాంగంలో పొందిపరిచిన గిరిజన హక్కులను పరిరక్షించి, గిరిజనులకు సత్వర న్యాయం చేయడానికి జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పడిందని జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు అనంత నాయక్ స్పష్టం చేసారు. ఆయన రెండు రోజుల పట్యనలో భాగంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిద గిరిజన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. నిర్ధిష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కమీషన్ పరిస్కరిస్తుందన్నారు. గిరిజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చెప్పిన సమస్యలను విన్నారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ నిజమైన ఫిర్యాదులు వస్తే తప్పకుండా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అల్లూరి సీతా రామ రాజు జిల్లా గిరిజన ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు నీల కంఠం మాట్లాడుతూ, షెడ్యూలు 5లో భారత రాజ్యాంగ కల్పించిన హక్కులను కచ్చతంగా అమలు చేయాలని చెప్పారు. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి మాట్లాడుతూ అల్లూరి సీత రామ రాజు జిల్లాను జోన్ 1లోనే కొన సాగించాలని కోరారు. అనంతరం గిరిజన సంఘాల నేతల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.శివ శ్రీనివాసు, ఐటిడి ఏ పిఓ వి. అభిషేక్, అదనపు ఎస్పీ పి.అనిల్, కమిషన్ అధికారులు, వివిద గిరిజన సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.










