ప్రజాశక్తి -చోడవరం
నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో విలీనం చేయాలని కోరుతూ ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం, ఆర్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఆర్క్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నయ యూనివర్సిటీ మాజీ విసి ఎం.ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఈ నెల 15లోగా నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని షెడ్యూల్డ్ గ్రామాల వివరాలు అందించమని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలను విలీనం చేయకపోవడం వల్ల గిరిజనులు ప్రభుత్వ అందించే వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు వంటివి రాకుండా పోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్క్ డైరెక్టర్ బీఎస్ ప్రసాద్, రిటైర్డ్ లెక్చరర్ ఎన్ దేముడు, రిటైర్డ్ ఆర్జెడి తిరుపతిరావు, సియాద్రి శ్రీనివాసరావు, పివి రమణ, కొండలరావు, తో పాటు సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.










