Jan 06,2023 00:12

యుసిఐఎం చర్చి వద్ద విద్యార్థులతో జర్మనీ దేశస్తులు

ప్రజాశక్తి -సీలేరు
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు రాస బేడ గిరిజన గ్రామాల్లో జన్మనీ దేశస్తులు సందడి చేశారు. నికాయిల్‌తో కూడిన 14 మంది జర్మనీయులు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాల్లో విస్తతంగా పర్యటించారు. ఇక్కడి గిరిజన ఆచార సంప్రదాయాలను తిలకించారు. రాసబేడ గ్రామానికి విదేశీయులు చేరుకోగానే గిరిజనులు వారి ఆచార సంప్రదాయాలతో పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. వారితో కాసేపు ముచ్చటించి వారి ఆచారాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ముందుగా రాజమండ్రి నుంచి వస్తు పోల్లూరు చేరుకొని క్రైస్తవ సంఘస్తులతో సమావేశమై బీద ప్రజల స్థితిగతులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సీలేరు యుసిఐఎం చర్చి వద్దకు వారు చేరుకోగానే యూసీఐఎం హాస్టల్‌ విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. విశ్రాంతి భవనంలో బిస్సప్‌ డాక్టర్‌ కేర్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్‌ మనసై తదితరులు పాల్గొన్నారు.