
ప్రజాశక్తి - సీతంపేట : మండలంలోని కొత్తకోటలో పాలకొండ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జయకృష్ణ మాట్లాడుతూ మినీ మేనిఫేస్టోలోని సూపర్ సిక్స్ అంశాలను వివరిస్తూ ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబునాయుడు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షులు సవర తోట మొఖలింగం, సర్పంచ్ బిడ్డీక అప్పారావు, మాజీ సర్పంచ్ బిడ్డిక స్వామినాయుడు, ఐటీడీపి కోఆర్డినేటర్ హిమరక పవన్, నాయకులు మండంగి ప్రకాశం, నిమ్మక ఆనంద్, సవర సోడంగి,ఆరిక సువర్ణ,ఆరిక వరలక్ష్మి, మూటక నరసింహులు, మండంగి భూషణ్, గ్రామ పెద్దలు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భూ దేవి ఆధ్వర్యంలో 'భవిష్యత్తుకు గ్యారెంటీ'
మండలంలోని మైదాన ప్రాంతాలతో పాటు ఎత్తైన కొండ ప్రాంతాల్లో కూడా టిడిపి నాయకులు పడాల భూదేవి శనివారం టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. మండ పంచాయతీ పరిధిలో ఎగువ బుడగరాయి, మద్య బుడగరాయి, దిగువ బుడగరాయి గ్రామాల్లో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టిడిపి మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాలు గూర్చి వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమతుం దన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ ముందుకు తీసికెళ్ళే సత్తా ఆయనతోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కురుపాం : చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతూ యువత భవిష్యత్తుకు భరోసా ఉంటుందని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి తోయక జగదీశ్వరి అన్నారు. శనివారం మండలంలోని ఒబ్బంగి పంచాయతీలోని తియ్యాలి, లిక్కిడి, లిక్కిడిగూడ, కాకిలి గిరిజన గ్రామాల్లో బాబుష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టిడిపి మినీ మేనిఫెస్టో గురించి వివరించి రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా టిడిపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అప్పుడే ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని అన్నారు. ఇప్పటికే వైసిపి ప్రభుత్వంపై ప్రజలు నిరాశతో ఉన్నారని కచ్చితంగా రాన్నున ఎన్నికల్లో వైసిపికి బుది చెబుతారని చెప్పారు. జనసేన, టిడిపి పొత్తులో కచ్చితంగా తాము విజయం సాధిస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ సమస్యలను గిరిజనులతో మాట్లాడి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కచ్చితంగా కృషి చేస్తామని జగదీశ్వరి గిరిజనులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శంకరరావు, భారతి, ప్రదీప్ పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్: రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసిపి రైతులను నట్టేట ముంచేలా వ్యవహరించడం బాధాకరమని, పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బోనెల విజరు చంద్ర అన్నారు. మండలంలోని రావికోన లో భవిష్యత్తు కు బాబు ష్యూర్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాలు సాగునీటి ఎద్దడితో వరి పంట ఎండిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసిపి ఎమ్మెల్యే బస్సు యాత్రల పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప రైతులను పట్టించుకోవడంలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జిల్లాలోని కరువు పరిస్థితులను అంచనా వేసి, నిధుల నష్టాన్ని గమనించి కరువు మండలాలుగా ప్రకటించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొరజాన చంద్రమౌళి, కార్యదర్శి చంద్రమౌళి, కార్యకర్తలు పాల్గొన్నారు.