Jun 02,2023 21:49

ప్రజాశక్తి - పోలవరం
             గిరిజన గ్రామాల ప్రజలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా భూదేవి పండుగ జరుపుకుంటారు. భూదేవి పండుగ సందర్భంగా మండలంలోని జిల్లెలగూడెం పంచాయతీ రెడ్డి కుంకాల గ్రామంలో శుక్రవారం డోలు వాయిద్యాలతో గిరిజన సంప్రదాయ నృత్యాలతో గిరిజనులు భూదేవి పండుగ జరుపుకున్నారు. గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగ వేడుకల్లో ఏలూరు జిల్లా ఎంపిపిల సంఘం అధ్యక్షులు, పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి పాల్గొని గిరిజన మహిళలతో పాటు గిరిజన సంప్రదాయ నృత్యం చేసి సందడి చేశారు. నేటి యువత విదేశీ సంస్కృతి వెనక పరిగెడుతున్న ఈ రోజుల్లో కూడా అనధికాలంగా వస్తున్న గిరిజన సాంప్రదాయాలను, ఆచారాలను గిరిజనులు నేటికి ఆచరించడం అభినందించాల్సిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుంకర వెంకట రెడ్డితో పాటు జిల్లెల్లగూడెం సర్పంచి కోటం గంగాదేవి, పార్టీ నాయకులు కోటం బాబురావు, రమేష్‌ పాల్గొన్నారు.