Dec 29,2022 00:00

నినాదాలు చేపడుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-పెదబయలు:మండలంలో లింగేటి పంచాయతీలో మాజీ మంత్రి, టిడిపి అరకు నియోజక వర్గం ఇంఛార్జి కిడారీ శ్రావణ్‌ కుమార్‌, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు సేకరీ సుకుమారిల అధ్వర్యంలో ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. కిడారికి మహిళలు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, గత తెలుగుదేశం పార్టీ హయాంలో మారుమూల గ్రామాల్లో రోడ్డు వేశామని, వైసిపి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలో వచ్చి మూడేళ్లు గడచినా గిరిజన గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. గ్రామాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. గిరిజన హక్కుల కోసం జెఏసీ ఆధ్వర్యంలో ఈనెల30న పాడేరులో జరిగే ఆదివాసీ గర్జనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి వంతల ఆనందరావు సీనియర్‌ నాయకుల తైసభు త్రినాదు అరకు అసెంబ్లీ సెల్‌ ఉపాధ్యక్షుడు సళ్లంగి రవికుమార్‌ మండల తెలుగు యువత అధ్యక్షుడు కొర్ర శేషు దారెల సర్పంచ్‌ పాంగీ, పాండురంగ స్వామి మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.