
పోలీసు అధికారులకు సూచనలు చేస్తున్న ఎస్‌పి విక్రాంత్‌పాటిల్
పాచిపెంట:మండలంలోని గిరి శిఖర గ్రామాలు బొర్రమామిడి, చిట్టేలబ, కన్నయ్యవలస గ్రామాలను ఎస్‌పి విక్రాంత్ పాటిల్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు రహదారి రవాణా సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం పాచిపెంట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పి.కోనవలస చెక్ పోస్ట్ వద్దా అంతర్ రాష్ట్ర వాహనాల తనిఖీలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట సిఐ ధనుంజరురావు. ఎస్‌ఐ ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.
సాలూరు: సాలూరు, మక్కువ రోడ్డులో నిర్మాణమైన నూతన పోలీసు స్టేషన్ భవనాన్ని జిల్లా ఎస్‌పి విక్రాంత్ పాటిల్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సిద్ధం గా ఉన్న భవనాన్ని పరిశీలించి సూచనలు చేశారు. ఆయన వెంట రూరల్ సిఐ ధనుంజయ రావు, ఎస్‌ఐ ప్రయోగ మూర్తి వున్నారు.