జరడలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు
ప్రజాశక్తి - కురుపాం : మండలంలో గిరిశిఖర గ్రామమైన జరడలో నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఇటీవల సీతంపేట, భామిని అటవీ ప్రాంతాల్లో సంచరించిన ఈ ఏనుగుల గుంపు గత కొద్దిరోజులుగా నీలకంఠాపురం, జరడ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఆయా గిరిజన గ్రామాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అటవీ ఫలసాయాలు నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, నిత్యం కొండ ప్రాంతాలకు వెళ్లి రావాల్సి వస్తుందని ఏ క్షణాన ఏం జరుగుతుందని భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపారు. శాశ్వతంగా తమ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించి వాటి భారి నుండి తమ పంటలను, ప్రాణాలను రక్షించాలని కోరుతున్నామన్నారు.










