Aug 03,2022 23:58

గీతంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన

ప్రజాశక్తి- విశాఖపట్నం : ఆజాదీ కా అమత్‌ మహోత్సవ్‌, 75ఏళ్ల భారత స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా గీతం నాలెడ్జి రిసోర్స్‌ సెంటర్‌లో బుధవారం ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారత స్వాతంత్య్ర చరిత్రకు సంబంధించిన గ్రంథాలతో పాటు మహత్మగాంధీ, నెహ్రూ, సర్ధార్‌ వల్లభారు పటేల్‌ రచనలు, చారిత్రక గ్రంథాలు, నాటి ఉద్యమ వివరాలను తెలిపే రచనలను ప్రదర్శనగా ఉంచినట్లు గీతం డిప్యూటీ లైబ్రేరియన్‌ డాక్టర్‌ సిబ ప్రసాద్‌ పండా తెలిపారు. ఈ నెల 15 వతేదీ వరకు సందర్శకుల కోసం పుస్తక ప్రదర్శన తెరచి ఉంచుతామన్నారు.
అలాగే గీతం ఎన్‌సిసి మహిళా కేడెట్‌ల ఆధ్వర్యంలో రుషికొండ పరిసర ప్రాంతాలలో 75 రకాల మొక్కలను నాటినట్లు ఎన్‌సిసి మహిళా విభాగం అధికారిణి డాక్టర్‌ పరిమళ వేణు తెలిపారు. 15 వతేదీ వరకు పలు క్రీడా, సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు గీతం క్యాంపస్‌ లైఫ్‌ ప్రొవైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమరావు తెలిపారు.