Mar 15,2023 23:13

గీతంలో మాట్లాడుతున్న న్యూహ్యాంప్‌షైర్‌ వర్సిటీ ప్రతినిధులు

ప్రజాశక్తి-మధురవాడ : అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ హ్యంప్‌షైర్‌ అకడమిక్‌ నిపుణుల బృందం బుధవారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాయాన్ని సందర్శించింది. న్యూ హ్యంప్‌షైర్‌ డీన్‌ మైక్‌ డిసెల్లే, గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ డీన్‌ డాక్టర్‌ కేరీమూర్‌హెడ్‌, ఇంజినీరింగ్‌ విభాగం చైర్మన్‌ క్రిస్టోఫర్‌ లెబ్‌ల్యాంక్‌, అడ్మిషన్ల విభాగం సహయ డైరక్టర్‌ మేడిసన్‌ ఫెరేరి గీతం ఇంజినీరింగ్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్లు, డీన్‌తో సమావేశమై బోధన, పరిశోధన అంశాలపై చర్చించారు. అనంతరం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో న్యూ హ్యంప్‌షైర్‌ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కోర్సులను, పరిశోధన అవకాశాలను వివరించారు. విద్యార్థుల సందేహలను నివృత్తిచేశారు. కార్యక్రమానికి గీతం అదర్‌ కెరీర్‌ ఆప్షన్స్‌ డిప్యూటీ డైరక్టర్‌ డాక్టర్‌ బి.రవికాంత్‌ సంధానకర్తగా వ్యవహరించారు.