ప్రజాశక్తి-మధురవాడ : భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ, న్యాయ విభాగం, గీతం స్కూల్ ఆఫ్ లా, భోపాల్‌లోని న్యాయగంగ ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న న్యాయ అవగాహన సదస్సు గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ప్రాథమికంగా పౌరుల తెలుసుకోవాల్సిన న్యాయ పరమైన అంశాలు, పౌరుల బాధ్యతలపై సమత స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు రవి రెబ్బాప్రగడ ప్రసంగించారు. సైబర్ నేరాలు, వాటిని నియంత్రించే చట్టాలపై సిబిఐ విశ్రాంత ఐపిఎస్ అధికారి వివి.లకీëనారాయణ, గీతం స్కూల్ ఆఫ్ లా డైరక్టర్ ప్రొఫెసర్ అనితారావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయ అవగాహనపై వివిధ నినాదాలు, సచిత్ర అంశాలతో ఎగ్సిబిషన్‌తో పాటు న్యాయ అంశాలపై క్విజ్ పోటీ నిర్వహించారు. సమకాలీన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విద్యార్థులు ప్రదర్శించిన వీధినాటిక ప్రజలను చైతన్య పరిచేదిగా ఉంది. న్యాయ వృత్తిలో మెళకువలపై విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందించడంతో పాటు, వాదోపవాదాలపై న్యాయస్థానంలో వృత్తి నైపుణ్యాన్ని పెంచటానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని గీతం స్కూల్ ఆఫ్ లా డైరక్టర్ ప్రొఫెసర్ బి.అనితారావు తెలిపారు. కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ లా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.