Jan 18,2023 23:05

జియో ట్యాగింగ్‌ పరిశీలిస్తున్న గీతం విసి

ప్రజాశక్తి -మధురవాడ : దేశ, విదేశాల నుంచి తెప్పించి, గీతంలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలు, పూలపొదలకు రెండు నెలలుగా గీతం స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న జియో ట్యాగింగ్‌ బుధవారంతో పూర్తయిందని ఆర్కిటెక్చర్‌ డీన్‌ ప్రొఫెసర్‌ మోహన్‌ తెలిపారు. ఆయా మొక్కల విశేషాలను వందకుపైగా మొక్కలకు క్యూఆర్‌ కోడ్‌తో జియోట్యాగ్‌ చేసామన్నారు. గీతం విద్యార్థులతోపాటు సందర్శకులెవరైనా మొక్కల సమాచారం తెలుసుకోవాలంటే, అయా మొక్కలపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను తమ మొబైల్‌లో స్కాన్‌ చేస్తే, వాటి శాస్త్రీయ నామంతోపాటు ఆయా మొక్కల భౌగోళిక ప్రాంతం, ఇతర వివరాలను తెలుసుకోవచ్చన్నారు. రానున్న రోజులలో గీతంలోని ఔషధ మొక్కల వివరాలతో ప్రత్యేక నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిపారు. విజయవంతంగా మొక్కల జియోట్యాగింగ్‌ పూర్తి చేయడంపై గీతం వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్ధవట్టం అభినందించారు.