ప్రజాశక్తి- మధురవాడ :ఐర్లాండ్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యా అవకాశాలపై అవగాహనకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫేర్‌ను ఐర్లాండ్ సెనేటర్ మాల్కం బైన్ ప్రారంభించారు. విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్ షిప్‌లు, ఉచిత విద్యారంగం, విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లను విద్యార్థులకు వివరించారు. ఈ ఎడ్యుకేషన్ ఫేర్‌లో ఐర్లాండ్‌లోని మేనూత్ విశ్వవిద్యాలయం, సౌత్ ఈస్ట్ టెక్నలాజికల్ యూనివర్శిటీ, నేషనల్ కాలేజ్ ఆఫ్ ఐర్లాండ్, అట్లాంటిక్ టెక్నలాజికల్ యూనివర్శిటీ, షన్నాన్, గ్రిఫిత్, ట్రినిటీ, గాల్వే తదితర విద్యాలయాల ప్రతినిధులు పాల్గొని తాము నిర్వహిస్తున్న కోర్సులు, ఉపకార వేతనాలను వివరించారు. ఈ సందర్భంగా గీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్‌ను ఐర్లాండ్ సెనేటర్ మాల్కం బైన్ మర్యాదపూర్వకంగా కలిసి వివిధ విద్యా సంబంధ అంశాలపై చర్చించారు. గీతంలోని వివిధవిభాగాలను సందర్శించారు. కార్యక్రమంలో గీతం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం, అకడమిక్ ప్రొ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ వారియర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్, ఎక్సటర్నల్ రిలేషన్స్ అసోసియేట్ డీన్ కమాండర్ గురుమూర్తి గంగాధరన్ పాల్గొన్నారు.










