Oct 14,2022 22:55

నివాళులర్పిస్తున్న బాలాకుమార్‌

ప్రజాశక్తి -మధురవాడ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ జయంతిని, ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ బయోకెమిస్ట్రీ, బయోఇన్ఫర్మేటిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ ఎమ్‌.బాలాకుమార్‌ మాట్లాడుతూ భారతీయ యువతలో స్పూర్తిని నింపడంలోనూ, అంతరిక్ష పరిజ్ఞానంలో దేశాన్ని ముందు వరసలో నిలపడంలో అబ్దుల్‌ కలాం కృషి మరువలేనిదన్నారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎమ్‌. శరత్‌చంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు అబ్దుల్‌ కలామ్‌ మార్గదర్శి అన్నారు. ప్రపంచ విద్యార్థి దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బయోకెమిస్ట్రీ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ కె.విజయ రేఛల్‌, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సిహెచ్‌. సురేఖ, ప్రొఫెసర్‌ ఎమ్‌. రామారావు పాల్గొన్నారు.