ప్రజాశక్తి-మధురవాడ : దేశంలోని విద్యా సంస్థల పనితీరును విశ్లేషించి వాటి స్థాయిని నిర్ణయించే నేషనల్ అస్సెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి ''ఎ++''గ్రేడ్‌ను ప్రకటించిందని గీతం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం తెలియజేశారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నాక్ గ్రేడింగ్‌లలో క్రమేపి ప్రగతిని సాధిస్తోందని 2011 సంవత్సరంలో ఎ గ్రేడ్, 2017లో ఎ+ గ్రేడ్‌ను సాధించిన గీతం ఇప్పుడు ఎ++ గ్రేడ్ సాధించడంలో అధ్యాపకులు, విద్యార్ధులు, పరిశోధకుల కృషి ఉందని ఆయన ప్రశంసించారు. నాక్ విశ్లేషనలో 4 పాయింట్లకు గాను ఈ ఏడాది 3.54 పాయింట్లు సాధించడంతో గీతం స్థాయి పెరిగిందన్నారు. దేశంలో నాక్ గుర్తింపు పొందిన దాదాపు 4201 విద్యాలయాలలో ఎ++ గ్రేడ్ సాధించినవి కేవలం 3 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. పరిశోధనలు, విశ్వవిద్యాలయ పరిపాలన, నూతన విద్యా విధానాలను అమలు చేయడం, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాది అవకాశాలను భవిష్యత్తులో మరింతగా ఉన్నతంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గీతం నాక్ ఎ++ గ్రేడ్ లభించడం పట్ల గీతం గీతం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఎమ్.గంగాధరరావు, గీతం ప్రోవైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు, ప్రొఫెసర్ జయశంకర్ వారియర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్‌లను ఆయన అభినంధించారు.