ప్రజాశక్తి- విశాఖపట్నం : విద్యార్థులకు శారీరక వ్యాయామం ప్రాధాన్యతను తెలియజేస్తూ ఫిట్‌నెస్‌పై అవగాహన, అభిరుచి పెంచేవిధంగా గీతం స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ విద్యార్థులు ఏర్పాటు చేసిన 'ఫిట్‌నెస్ ఫ్యాక్టరీ' పేరిట ప్రత్యేక యూత్ క్లబ్‌నుగీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్ బుధవారం ప్రారంభించారు. ఫిజియోథెరపీ కోర్సు అభ్యసిస్తూనే ఇతర విద్యార్థులకు ఫిట్‌నెస్‌లో మార్గదర్శకం వహించాలన్న క్లబ్ నిర్వాహకుల ఆలోచనను అభినందించారు. యువతకు మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం అవసరమని, అప్పుడే జీవితంలో సవాళ్ళను ఎదుర్కొనే సమర్థత చేకూరుతుందన్నారు. జిమ్‌సర్ ప్రో వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్. బి.గీతాంజలి ఫిట్‌నెస్ క్లబ్ ఏర్పాటు ఆలోచనను అభినందించారు. గీతం స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ డైరక్టర్ డాక్టర్ మాధురి కాశీ మాట్లాడుతూ విద్యార్థులు అసక్తితో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేలా జుంబా డాన్స్, హిప్ హప్ నత్యాలు, యోగా, బాలివుడ్ గీతాలకు ఫిట్‌నెస్ నత్యాలను క్లబ్ ద్వారా ప్రోత్సహిస్తామన్నారు. అలాగే ఫిట్‌నెస్‌కు సంబంధించిన సందేహలు, మెలకువలు, సమస్యలకు క్లబ్ ద్వారా పరిష్కారం చూపుతామన్నారు.










