Aug 17,2022 00:08

వర్క్‌షాపులో పాల్గొన్న ప్రతినిధులు

ప్రజాశక్తి-విశాఖపట్నం: బయోటెక్నాలజీ రంగంలో వేక్సిన్‌ల తయారీ, ఆరోగ్య సంబంధ ఉత్పత్తుల పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కలిగించడానికి గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ బయోటెక్నాలజీ విభాగం, ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమి (ఇన్సా) సంయుక్తంగా రెండు రోజుల పాటు ''రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఇన్‌ జినామిక్స్‌ అండ్‌ ట్రాన్స్‌జెనిసిస్‌'' అంశంపై నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ మంగళవారం ప్రారంభమైంది. స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎమ్‌.శరత్‌చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో సైన్స్‌ కోర్సుల డీన్‌ ప్రొఫెసర్‌ ఎమ్‌.బాలాకుమార్‌, టాటా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ జెనిటిక్స్‌ అండ్‌ సొసైటీ డైరక్టర్‌ డాక్టర్‌ రాకేష్‌ మిశ్రా, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ మాజీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ సుబీర్‌ ఎస్‌ మజందార్‌ హజరయ్యారు. సెంటర్‌ ఫర్‌ డిఎన్‌ఎ.ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగస్టిక్స్‌ (హైదరాబాద్‌) నిపుణుడు డాక్టర్‌ సుభదీప్‌ ఛటర్జీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ కృష్ణవేణి మిశ్రా పాల్గొని ప్రసంగించారు. బయోటెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ బి.వీరేంద్ర కుమార్‌, వర్క్‌షాప్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.వి.శిరీష, సీనియర్‌ ప్రొఫెసర్స్‌ ఎమ్‌.అనిత, డాక్టర్‌ పి.కిరణ్మరు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ కళాశాలకు చెందిన 150 మంది విద్యార్థులు హజరయ్యారు.