ప్రజాశక్తి-మధురవాడ : హరిత నిర్మాణాలను ప్రోత్సహించే విధంగా ఆర్కిటెక్చర్ నిపుణులను దేశానికి అందిస్తున్నందుకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ను జాతీయస్థాయిలో గుర్తిస్తూ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) గ్రీన్ బిల్డింగ్ ఛాంపియన్ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఐజిబిసి 20వ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌లో శనివారం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరక్టర్ ప్రొఫెసర్ కె.మోహన్‌కు నిర్వాహకులు అవార్డును అందజేశారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ద్వారా మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఎమ్.ఆర్క్ )లో గ్రీన్ బిల్ట్ ఎన్విరాన్ మెంట్‌పై ప్రత్యేక కోర్సు నిర్వహణతో పాటు 40 మందికి పైగా ఐజిబిసి గుర్తింపు గల నిపుణులను తయారుచేసినట్లు స్కూల్ డైరక్టర్ తెలిపారు. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో 28 మంది అధ్యాపకులు ఐజిబిసి అక్రిడిటెడ్ ప్రొఫెషనల్స్‌గా గుర్తింపు సాధించారని వెల్లడించారు. తమ ఆర్కిటెక్చర్ స్కూల్‌కు అనుబంధంగా ఐజిబిసి విద్యార్థి విభాగాన్ని నెలకొల్పి హరిత నిర్మాణాల ఆవశ్యకతపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో ముఖ్యంగా ఆకర్షణీయ నగరాల అభివృద్ధిలో ఐజిబిసి నిపుణత ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అవార్డు పట్ల గీతం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, అకడమిక్ ప్రొ వైస్ ఛాన్సలర్ జయశంకర్ వారియర్ హర్షం వెలిబుచ్చారు. తెలిపారు.










