ప్రజాశక్తి- విశాఖపట్నం :పాఠశాలల విద్యార్థులలో నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంచేవిధంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించిన అటల్ టింకరింగ్ ప్రయోగశాలల సంఖ్య పదివేలు దాటిన సందర్భంగా బుధవారం టింకరింగ్ డే పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్ (విడిసి) శిక్షకులు నగరంలోని వివిధ పాఠశాలలకు వెళ్ళి సూక్ష్మ ప్రాజెక్టలపై అవగాహన కల్పించారు. నూతన ఆవిష్కరణలు, వాటి ప్రయోజనం, స్టార్టప్ వాతావరణం, అటల్ ఇన్నోవేషన్ మిషన్ లక్ష్యాలతో పాటు పాఠశాల విద్యార్థులు బందంగా ఏర్పడి నూతన ఆలోచనలపై ఏవిధంగా దృష్ఠి నిలపాలనేనే అంశాలను వివరించారు. 30 నిమిషాల వ్యవధితో ఉండే ప్రాజెక్టులను అటల్ టింకరింగ్ ప్రయోగశాలలో తయారు చేయడంపై శిక్షణ ఇచ్చారు. గీతం విడిసి కోచ్ బి.రాజ్‌కుమార్, వెంకట గౌతమ్, సంధ్యారాణి, రాహూల్ ఉప్పసాల కార్యక్లమాలను పర్యవేక్షించారు.










