Sep 10,2022 23:21

ఆనందమార్గ్‌ బాలల ఆశ్రమంలో గీతం ఫార్మశీ ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

ప్రజాశక్తి- విశాఖపట్నం: గీతం డీమ్డ్‌ీ విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ ఫార్మశీ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్ల ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ ఫార్మశీ డీన్‌ ప్రొఫెసర్‌ పి.రామారావు, ఎన్‌ఎస్‌ఎస్‌. కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ.శ్రీనివాస్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుమంత మండల్‌ ఆధ్వర్యంలో పాత డెయిరీ ఫారం సమీపంలోని ఇందిరానగర్‌ ఆనంద్‌మార్గ్‌ బాలల ఆశ్రమంలోని పిల్లలకు స్టడీ మెటీరియల్‌తోపాటు దుప్పట్లు, పోషకాహరం, క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఫార్మశీ విద్యార్థులు తమ పాకెట్‌ మనీతో వీటిని కొనుగోలు చేసి బాలలకు అందించడం వారిలోని సేవా గుణానికి ప్రతీక అని ప్రొఫెసర్‌ రామారావు అభినందించారు.