ప్రజాశక్తి -మధురవాడ : గీతం డీమ్డ్ వర్సిటీకి అనుబంధంగా ఉన్న గీతం స్కూల్ ఆఫ్ లా బిఎ, ఎల్‌ఎల్‌బి (ఆనర్స్) ఫైనలియర్ విద్యార్థిని బి.చిన్మయి టాటా కంపెనీలో అసోసియేట్ లీగల్ క్లైమ్స్ ఉద్యోగానికి రూ.6.18 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారనిస్కూల్ డైరక్టర్ ప్రొఫెసర్ ఆర్.అనితారావు తెలిపారు. ప్రముఖ కంపెనీలు గీతం లా స్కూల్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, వాటి ఫలితాలు వెల్లడికావాల్సి ఉందన్నారు. గీతంలో న్యాయ కళాశాలలో యుజి, పిజి. కోర్సులను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నామని, న్యాయ విద్యార్థులు వత్తిలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలతో పాటు కార్పోరేట్ రంగంలో అవకాశాలు పొందే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు న్యాయ కళాశాల ప్లేస్‌మెంట్ కమిటి ఇన్‌ఛార్జి వర్ధమాన్ పన్వర్ తెలిపారు.










