Aug 30,2022 23:08

తనిఖీలు చేస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-సింహాచలం: జివిఎంసి 98 వ వార్డు పరిధిలోని సూర్య కల్యాణ మండపంలో పాసర్ల వరహాలమ్మ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె కుమారుడు పాసర్ల ప్రసాద్‌ పర్యవేక్షణలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 268 మంది వివిధ రోగాలకు వైద్య సేవలను పొందారు. ఈ వైద్య శిబిరంలో భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, 93వ వార్డు కార్పొరేటర్‌ రాపర్తి కన్నా, 94 వార్డు కార్పొరేటర్‌ బల్లా శ్రీను, 98వ వార్డు కార్పొరేటర్‌ పీవీ నరసింహం, తెలుగు యువత అధికార ప్రతినిధి సతివాడ శంకర్రావు, 98వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పంచదార శ్రీనివాసరావు, టిడిపి నాయకులు లండ శ్రీనివాసరావు, బీసీ రమణ తదితరులు పాల్గొన్నారు.