Jul 20,2022 23:33

గీతం దంత వైద్య కళాశాల

ప్రజాశక్తి- విశాఖపట్నం : కేంద్ర విద్యాశాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)- 2022 ర్యాంకింగ్స్‌లో గీతం దంత వైద్య కళాశాల, ఆసుపత్రికి 33వ ర్యాంకు వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.సీతారామరాజు తెలిపారు. దేశంలోని 300కుపైగా ప్రభుత్వ, ప్రైవేటు దంత కళాశాలల పనితీరును పరిశీలించిన ప్రభుత్వం ఈ ర్యాంకులను ప్రకటించిందన్నారు. ఉన్నత ప్రమాణాలతో గ్రాడ్యుయేట్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌ డెంటల్‌ కోర్సులను 20ఏళ్లుగా అందిస్తున్న గీతం దంత వైద్యకళాశాల, నోటి ఆరోగ్యంపై ప్రజలను చైతన్యపరుస్తూ ఏటా లక్ష మందికిపైగా ఉచిత వైద్య సేవలు అందిస్తోందన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సమిష్టికృషితో భవిష్యత్తులో మెరుగైన ర్యాంకు సాధిస్తామన్నారు.