Aug 29,2023 23:23
తెలుగు భాష దినోత్సవం సందర్భంగా సన్మానించిన ప్రముఖులతో జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: తెలుగు భాషా వికాసానికి గిడుగు వెంకట రామమూర్తి చేసిన సేవలను స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా అన్నారు. మంగళవారం గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో జిల్లా కలెక్టర్‌ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి గ్రాంధిక భాషను వ్యవహారిక భాషగా మార్చడానికి కృషి చేసిన మహానుభావు డని పేర్కొన్నారు. గ్రాంధిక భాషను వ్యవహారిక భాష చేయడానికి ఉద్యమం నడిపారన్నారు. తెలుగు బాషాభివద్ధి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ కవులను కలెక్టర్‌ సన్మానించారు. ముందుగా గిడుగు వెంకట రామ మూర్తి చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్‌ ముందు ఏర్పాటు చేసిన అద్దంకి పద్య శాసనాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివ జ్యోతి, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, నందనం శ్రీనివాసరావు, మన్నే శ్రీనివాసరావు, దివి శ్రీరామ్మూర్తి, రావూరి నరసింహరావువర్మ, పోలాసం వీరాజనేయలు, కె రాజేశ్వరి, జొన్నలగడ్డ సాధు హెర్బిట్‌, బిఎస్‌ నారాయణ భట్టు, నందిరాజు విజరు కుమార్‌, పరిమి సుబ్రమణ్యచారి తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల: వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతిని సాహితి భారతీ, ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ మెమోరియల్‌ క్లినిక్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సాహితీవేత్త బిడిఎస్‌ ప్రసాద్‌, ప్రముఖ రచయిత మన్నే శ్రీనివాస్‌, ప్రజాకవి డాక్టర్‌ శ్రీనివాస్‌, దివి శ్రీనివాసమూర్తి, ఆదం షఫీ, మాల్యాద్రిరావు, రావూరి నరసింహ వర్మ, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కస్తూరి శ్రీనివాసరావు పలువురు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.
బాపట్ల రూరల్‌: తెలుగు భాషా కోవిదుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా మంగళవారం కవిత సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులు గుదే రాజారావు ఆధ్వర్యంలో బాపట్ల మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహశీల్దారు సిహెచ్‌ సుధారాణి, ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు, బుద్ధం టైమ్స్‌ అధ్యక్షులు శ్రీనివాసరావు, వీఆర్వోలు, మహిళలు పాల్గొన్నారు.
బాపట్ల: మాతృ భాషలోనే ప్రతి ఒక్కరూ మాట్లాడాలని ప్రముఖ ఎండో క్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ శరత్‌బోస్‌ అన్నారు. మంగళవారం బాపట్ల జిల్లా రచయితల సంఘం శ్రీ భావ పురి విద్యాసంస్థలు ప్రాంగణంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలు జయలక్ష్మి ప్రసన్న, బి మోహిని మహిమ, కే దుర్గా భవానిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రచయితల సంఘం అధ్యక్షుడు తిమ్మన శ్యామ్‌ సుందర్‌, ప్రముఖ పద్య కవి వంగర శ్రీధర్‌, ఎం అనిల్‌ కుమార్‌రెడ్డి, షేక్‌ బాబావలి, జీవి, నందిరాజు విజరు కుమార్‌ పోలాసం వీరాంజనేయులు, ఆవుల వెంకటేశ్వర్లు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, కే సుబ్బారావు, కె చంద్రశేఖర్‌, ఆక్సి, మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.