Jul 12,2023 21:44

గిడ్డంగుల కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కళావతి

ప్రజాశక్తి- సీతంపేట : మండల కేంద్రంలో గిడ్డంగులు కేంద్రాన్ని ఎమ్మెల్యే కళావతి బుధవారం ప్రారంభించారు. ఆర్ట్స్‌ సంస్థ, నాబార్డ్‌ సహకారంతో నిర్మించిన ఈ కలెక్షన్స్‌ సెంటర్‌కు ఉద్యాన శాఖ రూ. 11.25లక్షలు ఎపిఒ రూ.3.75 లక్షలు కేటాయించి నిర్మించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కలెక్షన్‌ సెంటర్‌ ద్వారా రైతులు పండించిన అటవీ ఉత్పత్తులలో మార్కెట్‌ ధర వచ్చే విధంగా విక్రయాలుంటాయన్నారు. రైతులకు పైనాపిల్‌, పసుపు, చింతపండు, అల్లం ఒక దగ్గర చేర్చుకుని ఈ కలెక్షన్‌ సెంటర్‌లో పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయన్నారు. నాబార్డు డవలప్‌మెంట్‌ మేనేజర్‌ తుపాకుల నాగార్జున మాట్లాడుతూ ఈ రైతు ఉత్పద్దాల కంపెనీలు పండించిన పంటలు మార్కటింగ్‌ చేసుకుని తద్వారా వస్తే విలువ ఆధారిత అభివృద్ధి చేయించాలని ఆదివాసి ప్రాంతాల్లో ఈ యొక్క రైతు ఉత్పద్దాల కంపెనీలో మంచి ఫలితాలు ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డైరెక్టర్‌ ఎన్‌. సన్యాసిరావు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, మండల ఉద్యానవన శాఖ అధికారి సవరలక్ష్మి, జెడ్‌పిటిసి సవర రాము, సవర సింహాచలం తదితరులు పాల్గొన్నారు.