గిడ్డకింద మాణిక్యంకు బోయి భీమన్న జాతీయ పురస్కారం
గిడ్డకింద మాణిక్యంకు బోయి భీమన్న జాతీయ పురస్కారం
ప్రజాశక్తి - పిచ్చాటూరు: తిరుపతి జిల్లా లోని నారాయణవనం మండలం బ్రాహ్మణ తాంగల్‌కి చెందిన గిడ్డకింద మాణిక్యం కు ఉత్తమ కవితా విభాగంలో ఉత్తమ కవిగా బోయి భీమన్న జాతీయ స్మారక పురస్కారంతో ఉషోదయ ఫౌండేషన్ తిరుప తి వారు సత్కరించారు. జాతీ య స్థాయిలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని తన కవితలను చదివి వినిపించారు. సామాజిక స్పహతో వ్యాసం, కథ, సమీక్ష , వచన కవిత రచన వంటి బహుళ ప్రక్రియల్లో సాహితీ సేవ చేస్తున్న మాణిక్యంకు ఉత్తమ కవి అవార్డుకు ఎంపిక చేశారని ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టరు ధనాశీ ఉషారాణి తెలిపారు. అవార్డు అందుకోవటం చాలా సంతోషంగా ఉందని మాణిక్యం తెలిపారు. భవిష్యత్తులో మరింత సాహితీ రచనకు తన వంతు కషి చేస్తానని తెలిపారు.










