Aug 17,2023 17:10

నియోజకవర్గ పరిశీలకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి
ప్రజాశక్తి - కాళ్ల
రాబోయే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, జగనన్న ప్రభుత్వానికి జెసిఎస్‌ సైన్యం అండగా ఉండాలని వైసిపి ఉండి నియోజకవర్గ పరిశీలకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. పెదఅమిరంలో వైసిపి కార్యాలయంలో డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గంలోని సచివాలయ కన్వీనర్ల బీమా నమోదు శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తనూ పార్టీ గుర్తిస్తుందన్నారు. సచివాలయ కన్వీనర్లకు, గృహసారధులకు పార్టీ తరపున ఉచిత బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. జెసిఎస్‌ సైన్యం మొబైల్‌ యాప్‌ పని విధానాన్ని నమోదు చేసుకునే విధానాన్ని తెలిపారు. డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు మాట్లాడుతూ జెసిఎస్‌ సైన్యం యాప్‌ వైసిపి శ్రేణుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరేలా సచివాలయ కన్వీనర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కాళ్ల, ఉండి, ఆకివీడు మండలాలు, ఆకివీడు టౌన్‌, పాలకోడేరు మండల జగనన్న సచివాలయ కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.