ప్రజాశక్తి- బొబ్బిలి: రాష్ట్రంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంతో పని చేసేందుకు టిడిపి, జనసేన సమన్వయ కమిటీ తీర్మానం చేసింది. స్థానిక గెస్ట్ హౌస్లో గురువారం టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, జనసేన నియోజకవర్గ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయానికి ఐక్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టిడిపి, జనసేన మద్దతుదారుల ఓట్లు తొలగింపును గుర్తించి అడ్డుకోవాలన్నారు. స్థానిక సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఈ నెల 18,19న రోడ్లు దుస్థితిపై పోరాటం చేసేందుకు తీర్మానం చేశారు. సమావేశంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డెంకాడ: టిడిపి, జనసేన నెల్లిమర్ల నియోజకవర్గం ఆత్మీయ సమన్వయ కమిటీ సమావేశం మండలంలోని గంట్లం శ్రీశాంతి పేజ్-1లో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు పార్టీలు కలిపి గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి అలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని తీర్మానించాయి. టిడిప,ి జనసేన పార్టీల నాయకులు కలిసికట్టుగా ముందుకు వెళ్లి ఏ పార్టీకి టికెట్ ఇచ్చిన కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, సీనియర్ నాయకులు కంది చంద్రశేఖర రావు, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్, మహంతి శంకరరావు, కర్రోతు సత్యనారాయణ, పల్లె భాస్కరరావు, టిడిపి నాయకులు పతివాడ అప్పల నారయణ, అకిరి ప్రసాద్, గేదెల రాజారావు, జనసేన నియోజకవర్గం ఇంచార్జి లోకం మాధవి, జనసేన మహిళా అధ్యక్షులు తుమ్మి లక్ష్మీ రాజ్, క్లస్టర్ ఇంఛార్జిలు అట్టాడ శ్రీధర్, దంగా భూలోకం, లోకం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గరివిడి: అన్ని వర్గాల ప్రజలనూ ఇబ్బందులకు గురి చేస్తున్న రాష్ట్రంలోని జగన్ పాలనకు త్వరలోనే ముగింపు పడనుందని టిడిపి చీపురపల్లి నియోజకవర్గం ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. గురువారం చీపురుపల్లి టిడిపి కార్యాల యంలో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి- జనసేన ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏ ఒక్కరికీ మేలు చేయలేదని విమర్శించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు విసినిగిరి శ్రీనివాస రావు, రౌతు కృష్ణ వేణి, యడ్ల సంతోష్, తుమ్మ గంటి సూరినాయుడు, రేగిడి లక్ష్మణరావు, సాసుబిల్లి రామునాయుడు, ఎచర్ల లక్ష్మి నాయుడు, సిగ తవిటి నాయుడు, టిడిపి నాయకులు రౌతు కామునాయుడు, పైల బలరాం, తాడ్డే సన్యాసి నాయుడు, చనమల మహేశ్వర రావు, బలగం వెంకట రావు, ముల్లు రమణ, మహంతి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.