అనంతపురం కలెక్టరేట్ : వివిధ సమస్యలపై ప్రజలు అందించే జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ అర్జీలను నిర్దేశిత గడువులోపే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ గౌతమి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్‌ఒ గాయత్రిదేవి, ఆర్డీవో మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఆన్‌సెట్ సిఇఒ కేశవనాయుడులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆర్జీలను నిత్యం పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఎలాంటి పెండింగ్ లేకుండా పరిష్కారం చూపించేలా సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ, సర్వే, పిఆర్, డిపిఒ, హౌసింగ్ శాఖల పరిధిలో ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, ఆయా శాఖల పరిధిలో నాణ్యతగా అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. అర్జీదారుల్లో సంతప్తి స్థాయి పెంచేలా ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ అందిస్తూ పంచాయతీ రాజ్ ఎస్‌ఈ, పోలీస్, వ్యవసాయ శాఖలు బాగా పని చేస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఒ ప్రశాంత్ కుమార్, డీఆర్డీడీఏ పీడీ నరసింహారెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, డీపీవో ప్రభాకర్ రావు, ఇన్‌ఛార్జి డిఇఒ నాగరాజు, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సురేంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










