Nov 16,2023 00:26

ధర్నాలో మాట్లాడుతున్న సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య

ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌ : ఐక్యంగా ఉద్యమిస్తే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుందని సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య అన్నారు. తమ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి ఖాళీ చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక పెన్షనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం ఎదుట పెన్షనర్లు బుధవారం ధర్నా చేపట్టారు. ధర్నాకు అసోసియేషన్‌ నాయకులు లకీëనారాయణ అధ్యక్షత వహించగా వీరికి వివిధ పార్టీల వారు మద్దతు తెలిపారు. గద్దె చలమయ్య మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా జీవించాల్సిన వారు తమ కార్యాలయ భవనాన్ని ఒకరి కంబంధ హస్తాల నుండి కాపాడుకోవడం కోసం ధర్నా చేయాల్సి రావడం బాధాకరమన్నారు. పట్టణ నడిబొడ్డున నిర్మించిన పెన్షనర్ల భవనంలోని పై అంతస్తులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని కింది గదులను పట్టణానికి చెందిన జవ్వాజి సీతారామా య్యకు నెలకు రూ.500 అద్దెతో 12 ఏళ్లపాటు 2006లో లీజుకు ఇచ్చారని, సీతారామ్మయ్య ఆ గదుల్లో పాయనీర్‌ ఆటో మొబైల్‌ పేరుతో వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. అయితే లీజు గడువు ముగిసినా గదులను ఖాళీ చేయకుండా పెన్షనర్లను ఇబ్బంది పెడుతున్నారని, పెన్షనర్లంటే లేక్కలేనితనమే అతని తీరులో కనిపిఓ స్తోందని మండిపడ్డారు. ఈ పోరాటం విజయం సాధించాలంటే కొన్నింటిని అధిగ మించాల్సి ఉంటుందని, వ్యక్తి ప్రయోగనం కంటే వ్యవస్థ ప్రయోజనం ముఖ్యమని, అందుకే మొహమాటాలకు తావులేకుండా ఉద్యమించాలని చెప్పారు. పెన్షనర్లకు తమ పూర్తి మద్దతు ఉంటుఆదన్నారు. వైసిపి నాయకులు పక్కాల సూరిబాబు మాట్లా డుతూ సమస్యను తెలుసుకునేందుకు మంత్రి అంబటి రాంబాబు పంపించారని, ఈ అంశంలో న్యాయపరమైన ఇబ్బందుల్లే కుంటే పరిష్కారానికి మార్గం సుగమం అవు తుందని అన్నారు. అసోసియేషన్‌ తరుపున వినతి పత్రాన్ని తనకు ఇస్తే కలెక్టర్‌ ద్వారా పరిష్కారం అవుతుందని చెప్పారు. అనం తరం పెన్షనర్లు పట్టణంలో ప్రదర్శన చేశారు. సిపిఐ నాయకులు ఎన్‌.వేణుగో పాల్‌, యిర్మీయా, జైభీం భారత్‌ పార్టీ నాయ కులు విజరుకుమార్‌, జనసేన నాయకులు సాంబశివరావు, అసోసియేషన్‌ నాయకులు భూషణం, రాఘవయ్య, రామారావు, రంగారెడ్డి, పురుషోత్తం, నరసింహారెడ్డి, మురహరిరావు, మీరాకుమారి పాల్గొన్నారు.