Nov 17,2023 23:57

ధర్నాలో పెన్షనర్లు

ప్రజాశక్తి-సత్తెనపల్లి టౌన్‌ : బలవంతంగా ఆక్రమించుకున్న తమ భవనాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఏపీ రిటైర్డ్‌ ప్రభుత్వం ఉద్యోగ సంఘ నాయకులు చేపట్టిన ధర్నా శుక్రవారానికి 3వ రోజుకు చేరుకుంది. పలువురు నాయకులు మాట్లాడుతూ వృద్ధులమైన తాము ఏం చేస్తామనే ధీమాతో పయనీర్‌ ఆటో మొబైల్‌ యజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని, తమ పోరాటానికి ప్రజలు, రాజకీయ పార్టీలు అండగా నిలవాలని కోరారురు. అగ్రిమెంటు కాలం పూర్తయినా దౌర్జన్యంగా షాపును నిర్వహిస్తున్న యాజమాన్యం తీరను ప్రజలు, ప్రజాస్వామ్యకవాదులు అర్థం చేసుకోవాలి అన్నారు. వారు ఖాళీ చేసేదాక ధర్నా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనిపై ఆర్‌డిఒకు విన్నవిస్తామన్నారు. ధర్నాలో అసోసియేషన్‌ నాయకులు లక్ష్మీనారాయణ, వై.ప్రతాపరెడ్డి, బి.రామారావు, ఆర్‌.పురుషోత్తం, కేబిఅర్జె ప్రసాద్‌, నరసింహారెడ్డి, ఎ.ప్రభుదాస్‌ వెంకట్రావు, కె.హనుమంతరావు, చంద్రయ్య పాల్గొన్నారు.