ప్రజాశక్తి-ఆదోనిరూరల్
రాష్ట్రంలో 'గడపగడపకు మన ప్రభుత్వం'తో సమస్యలు దూరమై, ప్రజలు ప్రజాప్రతినిధులకు దగ్గరవుతున్నారని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 'గడపగడపకు'లో తెలుసుకున్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. అవసరం మేరకు ప్రతి వార్డుకూ రూ.20 లక్షలతో డ్రెయినేజీ, సిమెంట్ రోడ్లకు ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయిస్తున్నామని చెప్పారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల ఆశీస్సుతో 2024లో కూడా అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, తహశీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపిడిఒ గీతా వాణి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ నాగమల్లయ్య, ఎపిఒ చంద్రశేఖర్, పంచాయతీరాజ్ ఎఇ మాలిక్, ఎపిఎం జనార్ధన, సర్పంచి రాము, వైస్ ఎంపిపి పుష్పలత, ఎంపిటిసిలు బసప్ప, వెటర్నరీ డాక్టర్ క్రాంతి కుమార్, ఇస్వి ఎస్‌ఐ విజయలక్ష్మి, వైసిపి సీనియర్ నాయకులు మెడికల్ నాగరాజు, హనుమంతప్ప, గర్జప్ప, వీరేష్, కుప్పలదొడ్డి మార్లింగప్ప, వాటర్‌షెడ్ ఛైర్మన్ సంతోష్, బలరాం, నాగరాజ్, గాదిలింగప్ప పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి










