Apr 13,2023 21:04

ప్రజలకు వివరిస్తున్న ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి

గడపగడపకు సంక్షేమాలు : ఎమ్మెల్యే


ప్రజాశక్తి - చాగలమర్రి
గడపగడపకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు, మండల కన్వీనర్‌ కుమార్రెడ్డి, ఉపాధ్యక్షులు ఆశీర్వాదమ్మ, ఎంపీటీసీ సభ్యుడు పత్తినారాయణ, లక్ష్మిరెడ్డి, నరసింహులు, సర్పంచి మహేశ్వరి,సింగిల్‌ విండో అధ్యక్షుడు దస్తగిరి, నాయకులు శ్రీనివా సులరెడ్డి, వెంకట రామిరెడ్డి, కిరణ్‌,బాబు, భాస్కర్రెడ్డి, వెంకటయ్య, నరసిం హుడు, జగదీశ్వర్‌ రెడ్డి,వెంకట సుబ్బారెడ్డి, రామగుర్విరెడ్డి,తహసిల్దార్‌ విజరు కుమార్‌,ఎంపిడీఓ భాగ్యలక్ష్మి,ఎంఈఓ అనురాధ, ఏఈలు జగ్గయ్య, షఫివుల్లా షాజహాన్‌,ఏఓ రంగనేతాజి, ఈఓఆర్‌డి నాగేంద్రయ్య,ఏపిఓ నిర్మల,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యర్రగుడిలో.. మా నమ్మకం నువ్వే జగన్‌
కొలిమిగుండ్ల : మండలంలోని యర్రగుడి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్‌-మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బి.ఉప్పలూరు సచివాలయ కన్వీనర్‌ యాపర్ల.వెంకటేశ్వర రెడ్డి, గ్రామ సర్పంచ్‌ కంబగిరిస్వామి, ఎంపిటిసి పోలు.క్రిష్ణయ్య, నిమ్మకాయల రంగయ్య, రాంమోహన్‌ దస్తగిరి, గృహసారథులు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి పథకాలు
- ఆత్మకూరు మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు ఎంఏ రషీద్‌
ఆత్మకూర్‌: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆత్మకూరు మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు ఎంఏ రషీద్‌ అన్నారు. గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో జగనే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి సిఎం జగన్‌ స్టిక్కర్లను గృహ సారథులు, కన్వీనర్లు, వార్డు కౌన్సిలర్లు అతికించారు. ఈ సందర్భంగా ఎంఏ రషీద్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ ముర్తు జాబీ కలిముల్లా, మోమిన్‌ వహీద్‌, శాలి, ఫైల్‌ మాన్‌, కుతూష్‌, కన్వీనర్లు చంద్రచ ముర్తుజావలి, తదితరులు పాల్గొన్నారు.